![ఉద్యానవన పంటలు పరిశీలన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07rkm362-191061_mr-1738953515-0.jpg.webp?itok=ND0gZt0C)
ఉద్యానవన పంటలు పరిశీలన
ఖమ్మంరూరల్: మండలంలోని పొన్నేకల్, తల్లంపాడు, మద్దులపల్లిలో పందిరి విధానంలో సాగు చేస్తున్న కూరగాయల తోటలు, ఆయిల్‌పామ్, మామిడితోటలను జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి వి.మధుసూదన్ శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుత వాతావరణంతో ఆయా పంటలను ఆశించే తెగుళ్లు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులు ఉద్యానవన పంటలు సాగు చేయడం ద్వారా దీర్ఘకాలం లాభాలు సాధించొచ్చని తెలిపారు. ఉద్యానవన శాఖ పాలేరు నియోజకవర్గ అధికారి పి.అపర్ణ, రైతులు మల్ల య్య, హన్మంతరావు, రామలింగయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment