ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం
కారేపపల్లి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ విస్మరించిందని.. దీంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పాలనను కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌రావు అన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండా వాసి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వాంకుడోతు జగన్‌ను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎవరూ అడగకపోయిన పేదిళ్లలో ఆడబిడ్డల పెళ్లికి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.లక్ష సాయం అందించేవారని.. కాంగ్రెస్ మాత్రం రూ.లక్షకు తోడు తులం బంగారం ఇస్తామన్న హామీని విస్మరించిందని ఆరోపించారు. ఈసమావేశంలో నాయకులు ముత్యాల సత్యనారాయణ, ఉన్నం వీరేందర్, రావూరి శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, ముత్యాల వెంకటప్పారావు, అడపా పుల్లారావు, బానోతు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడుతాతా మధు
Comments
Please login to add a commentAdd a comment