![స్వాధీనం చేసుకున్న గంజాయితో
ఎకై ్సజ్ పోలీసులు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/13/12ckm520-191045_mr_0.jpg.webp?itok=1VAhU2HX)
స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎకై ్సజ్ పోలీసులు
ఖమ్మం క్రైం: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో ఎకై ్సజ్ అధికారులు 12కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం ఏఈఎస్ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యాన వరంగల్ క్రాస్ రోడ్, కోదాడ క్రాస్ రోడ్ల వద్ద తనిఖీలు చేశారు. ఈసందర్భంగా చైన్నెకి చెందిన భోజ రాజన్, నరేష్ వద్ద ఎనిమిది కేజీలు, భద్రాచలానికి చెందిన చల్ల ఉపేందర్ వద్ద నాలుగు కేజీల ఎండు గంజాయి లభించిందని ఖమ్మం ఎకై ్సజ్–2 సీఐ రాజిరెడ్డి తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.3లక్షలు ఉండగా నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ విరేందర్, ఎస్సైలు అచ్చారావు, ఎం.సరిత, ఉద్యోగులు నాయక్, వలరాజ్, లాజర్, నాగేశ్వరావు, రాములు, మౌలంకార్, రాధ, సురేందర్, గురుప్రసాద్, విశ్వనాథ్, నరేష్ నర్సింహారావు పాల్గొన్నారు.
నాయకన్‌గూడెంలో మూడు కిలోలు?
నేలకొండపల్లి: గంజాయి తరలిస్తున్న యువకుడిని శుక్రవారం నేలకొండపల్లి ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ యువకుడు శుక్రవారం గంజాయితో వస్తున్నాడని సమాచారం అందగా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం వద్ద మాటు వేశారు. ఈమేరకు యువకుడిని అదుపులోకి తీసుకుని మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ కుమ్మరి పోశెట్టి వివరణ కోసం యత్నించగా అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment