కేంద్ర బలగాల అండ.. | Sakshi
Sakshi News home page

కేంద్ర బలగాల అండ..

Published Tue, May 7 2024 4:20 AM

 కేంద

● ఎన్నికల నిర్వహణలో కీలకం ● స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు.. ఫ్లాగ్‌మార్చ్‌ ● జిల్లాకు మూడు కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు

ఖమ్మంక్రైం: మండుటెండ.. భారీ వర్షం.. గజగజ వణింకించే చలిలోనూ విధులు నిర్వర్తించడం కేంద్ర సాయుధ బలగాలను వెన్నతో పెట్టిన విద్య, ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన నెల క్రితం ఖమ్మం వచ్చిన కేంద్ర సాయుధ బలగాలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద స్థానిక పోలీసులతో కలిసి విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ ద్వారా స్థానికులకు భరోసా కల్పిస్తున్నారు.

కీలక పాత్ర

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలే కాక ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికలులు సజావుగా సాగడంలో స్థానికులు పోలీసులు ఎంత కీలకమో సాయుధ బలగాలూ అందే కీలకపాత్ర పోషిస్తాయి. ఇకక్కడి పోలీసులతో పాటు విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తాయి.

జిల్లాకు మూడు కంపెనీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం నుంచి మూడు కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండ్రస్ట్రియల్‌ ఫోర్స్‌) బాలగాలను జిల్లాకు చేరుకున్నాయి. వీరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన అంతర్‌జిల్లా, అంతర్రాష్ట చెక్‌ పోస్టుల్లో 24గంటలపాటు స్థానిక సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తిస్తూ నగదు, మద్యం అక్రమ రవాణాను అరికట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే, సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తూ ఓటర్లలో మనోధైర్యాన్ని పెంచుతున్నారు. వీరంతా అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఆధ్వర్యాన విధులు నిర్వర్తిస్తుండగా సిబ్బందికి ఖమ్మం పోలీసు కమిషనర్‌ సీపీ సునీల్‌దత్‌ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. కాగా, రెండు, మూడు రోజుల్లో మరో మూడు కంపెనీల బలగాలు రానుండగా పోలింగ్‌ రోజు బందోబస్తు విధుల్లో పాలుపంచుకోనున్నారు.

 కేంద్ర బలగాల అండ..
1/2

కేంద్ర బలగాల అండ..

 కేంద్ర బలగాల అండ..
2/2

కేంద్ర బలగాల అండ..

Advertisement

తప్పక చదవండి

Advertisement