పంటల రీ సర్వేను అడ్డుకున్న రైతులు | - | Sakshi
Sakshi News home page

పంటల రీ సర్వేను అడ్డుకున్న రైతులు

Published Wed, Oct 30 2024 12:05 AM | Last Updated on Wed, Oct 30 2024 12:05 AM

-

బోనకల్‌: మండలంలోని రాపల్లిలో పంట నష్టపరిహారం జాబితాలో అవకతవకలు జరిగాయని పలువురు రైతులు కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఏఓలు నారాయణరావు, శరత్‌, నాగేశ్వరావుతో పాటు ఏఈఓలు నాగసాయి, హుస్సేన్‌ మంగళవారం రీ సర్వే చేసేందుకు వచ్చారు. ఈక్రమాన రైతులు విడిపోయి తమ పొలాలను ఎదుటి వర్గం చూపించడమేమిటని ఒక వర్గం, అనర్హుల పేర్లను జాబితాలో చేర్చినందున రీ సర్వే చేయాల్సిందేనని ఇంకో వర్గం వారు పట్టుబట్టారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుందనే అనుమానంతో వెళ్లిపోయామని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement