రూ.10 లక్షలు రికవరీ, రూ.1.39 లక్షల జరిమానా
ముగిసిన సామాజిక తనిఖీ ప్రజావేదిక
కామేపల్లి: కామేపల్లిలో మండలం గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన ఈజీఎస్ పనులపై చేపట్టిన సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అడిషినల్ డీఆర్‌డీఓ శిరిష మాట్లాడారు. ఒకే వ్యక్తికి రెండేసి జాబ్‌కార్డుల జారీ, మస్టర్ల నిర్వహణలో లోపాలు, అంచనా వేసిన పనికి అదనంగా ఉండడంతో పాటు కొలతల్లో తేడాలు గుర్తించామని తెలిపారు. అలాగే, ఎంబీ రికార్డు చేయకుండానే చెల్లింపులు బయటపడ్డాయమని చెప్పారు. ఈ మేరకు అవకతవకలకు పాల్పడిన కార్యదర్శులు, ఫీల్డ్ అసిసెంట్లు, టీఏలకు రూ.1.39లక్షల జరిమానా విధించగా రూ.10,36,271 లక్షల రికవరీకి నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాక గోవింద్రాలలో ఇద్దరు, బర్లగూడెంలో ఒక సీనియర్ మేట్‌ను తొలగించామని, కెప్టెన్ బంజర కార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో పవన్, రమేశ్, వెంకటపతిరాజు, శ్రీరాణి, సాంబశివాచారి పాల్గొన్నారు.
ఫంక్షన్‌కు వెళ్లొచ్చే సరికి చోరీ
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన బట్టపోతుల క్రాంతి–అంజలి దంపతులు డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్నారు. వీరు మంగళవారం ఓ పంక్షన్‌కు వెళ్లొచ్చే సరికి ఇంటి తలుపులు, బీరువా పగలగొట్టి ఉన్నాయి. ఈమేరకు రూ.10 వేల నగదు, రెండు జతల చెవిదిద్దులు, పట్టీలు చోరీ జరిగాయని పోలీసులు ఫిర్యాదు చేశారు.
పాలేరు జలాశయంలో మృతదేహం లభ్యం
కూసుమంచి: మండలంలోని పాలేరు జలాశయంలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన పసుపులేటి రామకృష్ణ(52)గా కుటుంబీకులు గుర్తించారు. ఆయన సోమవారం తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఆటోలో పాలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నాడు. స్నేహితుడు వస్తున్నాడని చెప్పి ఆటోడ్రైవర్‌ను పంపించగా ఆయన కుటుంబీకులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో రామకృష్ణ కుటుంబసభ్యులు చేరుకుని గాలిస్తుండగా మంగళవారం ఉదయం పాలేరు ఔట్ ఫాల్ కాల్వ గేటు వద్ద మృతదేహం లభ్యమైంది. ఘటనపై ఆయన సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment