ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగానే కాక దళితుల ఐక్యత కోసం మాల మహానాడు ఆధ్వర్యాన భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు చేపట్టిన మహా పాదయాత్ర మంగళవారం ఖమ్మం చేరుకుంది. ఈసందర్భంగా యూనిటీ ఆఫ్ మాల, మాల మహానాడు నాయకులు జెడ్పీ సెంటర్‌లో సుధాకర్, నాయకులకు స్వాగతం పలికారు. ఈమేరకు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిక సుధాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారని విమర్శించారు. ఓట్లు వేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇప్పుడు మాలలకు అన్యాయం చేయడమేమిటని ప్రశ్నించారు. ఇకనైనా వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోకపోతే మాలల ఆగ్రహానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. కాగా, డిసెంబర్ 1న యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభకు మాలలు తరలిరావాలని సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల ఉపేందర్, ఏ.మధు, జాగటి మధు, బీ.జీ.క్‌లైమెంట్, కనకయ్య, శ్రీను, ఎల్లయ్య, నాగలక్ష్మి, కామా ప్రభాకర్, శ్రీరాములు, రవి, సురేష్, ఎం.రవి, రాము, రామకృష్ణ, మనోజ్, వినయ్, కనకరత్నం, రాంబాబు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్
Comments
Please login to add a commentAdd a comment