ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్ల కోసం జిల్లాలో తొమ్మిది కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం తెలిపారు. ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, వైరా, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధి జిన్నింగ్ మిల్లులో వీటిని ఏర్పాటుచేశామని, ఇప్పటి వరకు 85 మంది రైతుల నుంచి 173.94 మెట్రిక్ టన్నుల పత్త్తిని సీసీఐ కొనుగోలు చేసిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి కనీస మద్దతు ధర రూ.7,521గా నిర్ణయించిందని, 8 నుంచి 12 శాతం మధ్య తేమ కలిగిన పత్తి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, పత్తి కొనుగోళ్లు, ఇతర వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా 88972 81111 వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కాగా, సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకొచ్చే రైతులు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్‌లతో పాటు ఆధార్ నంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ సమర్పించాలని సూచించారు.
కేంద్రాలు ఎక్కడెక్కడ అంటే...
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలోని జీఆర్‌ఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, తల్లంపాడులోని శ్రీ సాయి బాలాజీ జిన్నింగ్ అండ్ ఆయిల్ మిల్, పొన్నెకల్లులోని జీఆర్‌ఆర్ జిన్నింగ్ మిల్, మధిర మండలం మాటూరులోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్, దెందుకూరులోని అమరావతి టెక్స్‌టైల్స్ ప్రైవేటు లిమిటెడ్, ఇల్లెందులపాడులోని శ్రీ శివ గణేష్ కాటన్ ఇండస్ట్రీస్, ముదిగొండ మండలం సువర్ణాపురంలోని ఉషశ్రీ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్స్, తల్లాడలోని స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, తిరుమలాయపాలెం మండలంలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపడుతోందని డీఎంఓ అలీం తెలిపారు.
వివరాల కోసం వాట్సాప్ నంబర్
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి అలీం
Comments
Please login to add a commentAdd a comment