సీసీ రోడ్ల నాణ్యత పరిశీలన
కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. కారేపల్లిలోని క్యాబిన్ బజార్, బీసీ కాలనీ, భారత్ నగర్, ఎన్‌వీఆర్ నగర్‌లో వేసిన సీసీ రోడ్లకు పగుళ్లు వచ్చాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో క్వాలిటీ కంట్రోల్ బృందం నాణ్యతను తనిఖీ చేసింది.
5 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో 327 పోస్టుల నియామకానికి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలించనున్నారు. ఈ పరీక్ష ఆగస్టు 6, 7వ తేదీల్లో నిర్వహించగా 327 మందితో మెరిట్ జాబితాను గత నెల 29న యాజమాన్యం విడుదల చేసిన విషయం విదితమే. ఈ మేరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో పరిశీలించనుండగా, ఆతర్వాత మెడికల్ బోర్డుకు పంపిస్తారు.
వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పీఓ
అశ్వాపురం: మండలంలోని రామచంద్రాపురం–ఒడ్డుగూడెం గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన వంతెనను ఐటీడీఏ పీఓ రాహుల్ శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment