కులమతాలను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు
నేలకొండపల్లి: అధికారం కోసం బీజేపీ కులాలు, మతాలను అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలపై నిస్వార్థంగా పోరాడుతూ, జైలు జీవితాలను గడిపింది కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులకు జైలుకు వెళ్లిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలను అంతం చేస్తామన్న టీడీపీ తెలంగాణలో లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ నేతలకు రాముడిపై భక్తి లేకపోగా, ఓట్ల కోసమే రామజపం చేస్తున్నారని విమర్శించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మరికంటి ఉమారాణి, రమేష్, గండు సైదులు, వెంకటేశ్వర్లు తదితరులు కూనంనేనిని సన్మానించారు. ఈ సమావేశంలో సీపీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు దండి సురేష్, మహ్మద్ మౌలానా, కర్నాటి భానుప్రసాద్, పాల్తీయ శ్రీనివాసరావు, కనకబండి సీతారాములు, పెద్దపాక గురవమ్మ, మేకల పుల్లయ్య, మల్లెబోయిన ఉపేందర్, పోలంపల్లి నారాయణ, కుంచం బిక్షం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment