కొనసాగుతున్న మాలల మహాపాదయాత్ర
తిరుమలాయపాలెం: ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరగనున్నందున నిలిపివేయాలనే డిమాండ్‌తో భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు మాల మహానాడు ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్ర తిరుమలాయపాలెం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్‌కు యూనిటీ ఆఫ్ మాల నాయకులు స్వాగతం పలికారు. అనంతరం సుధాకర్, నాయకులు కమటం లక్ష్మణ్, కొప్పుల అశోక్, రామకృష్ణ, ప్రసాద్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తమ పాదయాత్ర 16 జిల్లాల్లో వెయ్యి కి.మీ. మేర సాగుతూ డిసెంబర్ 1న హైదరాబాద్‌లో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పప్పుల ప్రసాద్, ధరమల్ల ఉపేందర్, సందు రాజు, ఉండేటి ప్రకాశం, గుంతేటి వెంకటేశ్వర్లు, నూకతొట్టి సాల్మన్‌రాజ్, ఉండేటి ధర్మరాజు, ఉబ్బని కార్తీక్, కిరణ్, తూమాటి హజరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment