దేశాభివృద్ధిని పరుగులు పెట్టించిన ఇందిరాగాంధీ
ఖమ్మంవన్‌టౌన్: ప్రధానిగా ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణలో దేశాభివృద్ధి పరుగులు తీసిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ వెల్లడించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఖమ్మం పాత మున్సి పల్ కార్యాలయం వద్ద ఉన్న ఆమె విగ్రహంతో పాటు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో సంస్కరణలకు బీజం వేయడమే కాక మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు, ప్రజాప్రతినిధులు దొబ్బల సౌజన్య, నాగండ్ల దీపక్‌చౌదరి, పుచ్చకాయ ల వీరభద్రం, కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్, మొక్కా శేఖర్‌గౌడ్, బొడ్డు బొందయ్య, లకావత్ సైదులు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, పాలకుర్తి నాగేశ్వరరావు, మద్దినేని రమేష్, ఎండీ.పాషా, బాణాల లక్ష్మణ్, సూర్యనారాయణ, ప్రతిభారెడ్డి, ఇబ్రహీం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment