శబ్దకాలుష్యానికి కారణమవుతున్న సైలెన్సర్ల తొలగింపు
ఖమ్మంక్రైం: వాహనాలకు కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి పెద్ద శబ్దాలు చేసేవి బిగిస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్న వాహనదారుల కట్టడిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఈమేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఆధ్వర్యాన ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 25 వాహనాల సైలెన్సర్లను తీయించి వాహనదారులకు రూ.వెయ్చి చొప్పున జరిమానా విధించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కొందరు ద్విచక్రవాహనాలకు సంస్థ అమర్చిన సైలెన్సర్లకు బదులు అమరుస్తున్న వాటితో ధ్వని కాలుష్యం ఏర్పడడమే కాక ఇతర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈవిషయమై అందిన ఫిర్యాదులతో డ్రైవ్ చేపట్టామని, ఇది నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే, లైసెన్సు తీసుకోని, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐ మోహన్‌బాబు, ఆర్‌ఐ సాంబశివరావు, ఎస్‌ఐలు సాగర్, రవి, వెంకన్న, రాము పాల్గొన్నారు,
Comments
Please login to add a commentAdd a comment