సత్తుపల్లిటౌన్: అయ్యప్ప మాలధారులు నియమనిష్టలతో 48 రోజుల దీక్ష చేశాకే ఇరుముడి కట్టుకోవాలని కేరళ మేలు తంత్రి చంద్రమౌళి వెంకటేష్‌శర్మ తెలిపారు. సత్తుపల్లిలోని శ్రీహరిహరాత్మజ అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. మాలధారణ చేసిన భక్తులు ఇంట్లో లేదా ఆలయాల్లో సాత్విక ఆహారం తీసుకోవాలే తప్ప రహదారి వెంట ఆహారం తీసుకోవడం సరికాదన్నారు. పదేళ్లలోపు బాలికలు, 55ఏళ్లు నిండిన మహిళలు శబరిమలైలో స్వామిని దర్శించుకోవచ్చని, అక్కడికి వెళ్లలేని వారు స్థానిక ఆలయాల్లో స్వామిని దర్శించుకోవచ్చన్నారు. కాగా, మకర సంక్రాంతి రోజున వందల ఏళ్లుగా శబరిమలలో ఉత్తర నక్షత్రం రూపంలో స్వామి దర్శనం ఇస్తారని తెలిపారు. అలాగే, అటవీ ప్రాంతాల వారు ఇచ్చే హారతే మకరజ్యోతి అని పేర్కొన్నారు. ఈసమావేశంలో ఆలయ కమిటీ బాధ్యులు దోసపాటి అమరలింగేశ్వరరావు, వందనపు సత్యనారాయణ, మున్సిపల్ ఛైర్మన్ కూసంపూడి మహేష్‌తో పాటు ద్రోణంరాజు మల్లికార్జునశర్మ, దురిశేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment