జైళ్ల శాఖ ఉద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకే రీట్రీట్
ఖమ్మంరూరల్: జైళ్లశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకే రీట్రీట్ నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో బుధవారం వరంగల్ రేంజ్ ఉద్యోగులకు బుధవారం ఏర్పాటుచేసిన రీట్రీట్‌లో డీఐజీ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఉద్యోగుల వారీగా సమస్యలు తెలుసుకున్న ఆయన పరిష్కారంపై భరోసా కల్పించారు. కాగా, జైళ్లు గతంలో మాదిరి కాకుండా నేరస్తుల్లో పరివర్తన తీసుకొచ్చే ఆశ్రమాలుగా మారాయని తెలిపారు. జైలు నుండి బయటకు వెళ్లేలోగా ముద్దాయిలు ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈకార్యక్రమంలో ఖమ్మం జిల్లా జైలు సూపరింటెండెంట్ ఏ.శ్రీధర్‌తో పాటు రేంజ్ పరిధిలోని జైళ్ల అధికారులు టి.కళాసాగర్, జి.విజయ్ డేని, జి.వెంకటేశ్వర్లు, ఏ.సక్రునాయక్, జి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment