ఇంటర్‌నెట్ వినియోగంలో అప్రమత్తత తప్పనిసరి
ఖమ్మంవన్‌టౌన్: ఇంటర్‌నెట్ వినియోగం తప్పనిసరైన పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌సెల్ డీఎస్పీ ఫణీందర్ సూచించారు. స్కోప్ ఆర్డీ స్వచ్ఛంద సంస్థ, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఖమ్మం టీటీడీసీ భవనంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత విద్యావిధానంలో బాలబాలికలు ఇంటర్‌నెట్ వినియోగించక తప్పడం లేదని, ఈ సమయాన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత మేలు చేస్తుందో అదే స్థాయిలో కీడు పొంచి ఉందనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి విష్ణువందన మాట్లాడుతూ ఇంటర్‌నెట్ వినియోగం, ఆన్‌లైన్ వేధింపులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. స్కోప్ ఆర్డీ డైరెక్టర్ ఎంఎల్.ప్రసాద్ మాట్లాడగా సైబర్ క్రైమ్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రంజిత్‌కుమార్, బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు డి.లింగయ్య, సీడీపీఓ వీరభద్రమ్మతో పాటు నర్సింహారావు, భాస్కర్, రాజకుమారి, సమ్రిన్, ప్రమీల, ప్రభావతి, యశోద, సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment