● సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల విభాగాల మార్పు ● ఔట్ సోర్సింగ్ సిబ్బందిపైనా దృష్టి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ పాలనపై అధికారులు దృష్టి సారించినట్లు తెలు స్తోంది. కొందరు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తీరుతో విమర్శలు వస్తుండడంతో ప్రక్షాళనకు కమిషనర్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఏళ్లుగా ఒకే విభాగంలో పాతుకుపోయిన ఉద్యోగులను మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎస్టాబ్లిష్‌మెంట్, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, అకౌంట్స్ తదితర విభా గాల రెగ్యులర్ ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి మార్చేలా జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సెలవుపై వెళ్లి రాగానే ఈ అంశంపై దృష్టి సారించడంతో విధుల్లో అలసత్వం వహించడమే కాక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు చెక్ పడనుందని చెబుతున్నారు.
ఔట్ సోర్సింగ్ పై పోకస్..
కేఎంసీలో లెక్కకు మించి ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో కొందరు విధులకు హాజరుకాకుండానే వేతనాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇక కంప్యూటర్ ఆపరేటర్లుగా చలామణి అవుతున్న సిబ్బందిలో పలువురికి అవగాహన లేకుండానే కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవల వరదల సమయాన ఆపరేటర్లకు డేటా ఎంట్రీ పనులు అప్పగిస్తే తాము చేయలేమని చేతులెత్తేయడంతో విషయం బయటపడింది. దీంతో వీరిని పక్కన పెట్టాలని నిర్ణయిస్తున్నట్లు సమాచారం. అలాగే, ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో పలువు రిపై అవినీతి ఆరోపణలు రావడంతో విభాగాలు మార్చాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది.
సంఘాల నేతలు క్యూ..
పనిచేయకుండా ఖాళీగా ఉంటున్న సిబ్బందితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విభాగా లు మార్చేందుకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్న విషయం బయటకు పొక్కింది. దీంతో వారిని కదిలించొద్దని కార్మిక సంఘాల నాయకులు కేఎంసీ కార్యాలయానికి వస్తుండడంపై అధికారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఉద్యోగులతో పని చేయించుకోకుండా నాయకులు అడ్డు తగులుతుండడంపై ఆగ్రహంగా ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులకు పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment