పౌష్టికాహారం పంపిణీలో నిర్లక్ష్యం వద్దు..
వైరా: ప్రజలకు పౌష్టికాహారం పంపిణీ ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు వి.ఆనంద్, బి.జ్యోతి హెచ్చరించారు. వైరా వ్యవసాయ మార్కెట్‌లోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి బుధవారం వారు తనిఖీ చేశారు. నిల్వ ఉన్న బియ్యం, పంచచార వివరాలు తెలుసుకున్న వారు పంచదార పంపణీ చేయకుండా పక్కన పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం అమలుపై ఆరాతీసేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రజ లందరికీ పౌష్టికాహారాన్ని అందించడమే ఆహార భద్రత చట్టం ఉద్దేశమని, ఈ విషయంలో అధికా రుల జాగ్రత్తలు వహించాలని సూచించారు.
● కొణిజర్ల: బాలికల ఆరోగ్యం విషయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది శ్రద్ధ వహిస్తూ వారికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సమకూర్చాలని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఆనంద్, జ్యోతి సూచించారు. కొణిజర్ల సమీపాన బస్వాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన వారు విద్యార్థినులతో మాట్లాడగా బియ్యం సరిగా లేక భోజనం తినలేకపోతున్నామని తెలిపారు. అలాగే, పలువురు బాలికలు రక్తహీనతతో బాధ పడుతున్నట్లు చెప్పారు. అనంతరం వంటి గదిలో పరిశీలించగా మెనూ చార్ట్ ఉండడంపై ఆగ్రహించిన వారు డైనింగ్ హాల్‌కు మార్చాలని సూచించారు. తొలుత కొణిజర్ల పీహెచ్‌సీలో పరిశీలించినవారు రోజువారీ ఓపీ, ప్రసవాలపై సంఖ్యపై ఆరాతీశారు.
చట్టం అమలులో నిర్లిప్తత విడనాడాలి
గోదాంలు, పాఠశాలల్లో ఆహార భద్రతా కమిషన్ బాధ్యుల తనిఖీ
ఏన్కూరు: పాఠశాలల్లో బాలికలకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలని కమిషన్ సభ్యుడు ఆనంద్ సూచించారు. ఏన్కూరులోని కేజీబీవీ, బాలికోన్నత పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాలలతో పాటు హిమామ్‌నగర్‌లో రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. కేజీబీవీలో సరుకులను పరిశీలించిన ఆయన కోడిగుడ్లు చిన్నగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గంటా శ్రీలత, డీఎస్‌ఓ చందన్‌కుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ రాజేందర్, ఉద్యోగులు రాజశేఖర్, దయామణి, సీహెచ్.శేషగిరిరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment