పాఠశాలల్లో విధిగా మెనూ పాటించాలి
ఎర్రుపాలెం: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలులో విధిగా మెనూ పాటించాలని, తద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు జెడ్పీహెచ్‌ఎస్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆమె సమస్యలు తెలుసుకున్నారు. ఆతర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె ఉపాధ్యాయులు, నిర్వాహకులకు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని భీమవరంలో ఇటీవల మృతి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడు ఎస్.కే.సైదాసాహెబ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందచేశారు. డీఎల్పీఓ రాంబాబు, ఎంఈఓ బి.మురళీమోహన్రావు, ఎంపీఈఓ జి.శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు దినేష్, శివుడు పాల్గొన్నారు.
లష్కర్ల నియామకానికి
గ్రీన్‌సిగ్నల్
ఖమ్మంఅర్బన్: నీటి వనరుల పర్యవేక్షణ కోసం లష్కర్లను నియామకానికి అనుమతి లభించింది. నీరు ఎక్కడా వృథా కాకుండా, సాగునీరు సక్రమంగా అందేలా పర్యవేక్షణకు లష్కర్లను ఏర్పాటుచేసుకోవాలని జలవనరులశాఖ ఈఎన్సీ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. లష్కర్లు లేని ప్రాంతాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ 45ఏళ్లలోపు వారిని నియమించుకోవాలని సూచించారు. దీంతో జిల్లాలో 225 మంది నియామకం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment