మృత్యువే వారిని విడదీసింది...
కొణిజర్ల: కలిసిమెలిసి జీవిస్తున్న అన్నాదమ్ముళ్లను రోడ్డుప్రమాదం విడదీసింది. పనుల కో సం రోజు మాదిరి గానే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృత్యువు రూపంలో ఎదురొచ్చిన బస్సు ఢీకొట్టడంతో తమ్ముడు కన్నుమూయగా, అన్న తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్‌ఐ గుగులోత్ సూరజ్ వెల్లడించారు. వైరా మండలం వల్లాపురానికి చెందిన అన్నాదమ్ముళ్లు కటికల సిల్వరాజు(35), కటికల శోభన్‌బాబు ఖమ్మంలో పెయింటింగ్ పనులు చేస్తుంటారు. రోజుమాదిరిగానే శుక్రవారం ఉద యం వారిద్దరు బైక్‌పై ఖమ్మం బయలుదేరగా, పల్లి పాడు సమీపాన ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న కొత్తగూడెం డిపో అద్దె బస్సు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఓ యువకుడు సిల్వరాజుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోగా అక్కడే మృతి చెందాడు. ఆయన అన్న శోభన్‌బాబును ఆస్పత్రికి తరలించారు. కాగా, సిల్వరాజుకు భార్య దేవమణి, కొడుకు సాత్విక్, కూతురు హర్షిత ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో దళారుల దందా
నేలకొండపల్లి: వరి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా.. కొన్నిచోట్ల సిబ్బంది సహకారంతో దళారులు అడ్డాగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో దళారులదే రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. రైతు వద్ద క్వింటాకు రూ.1,900 నుంచి రూ.2 వేల వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఓ వ్యాపారి అదే రైతు పేరుతో మార్కెట్‌కు తీసుకొచ్చి ఆరబోశాడు. ప్రభుత్వ మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి క్వింటాకు రూ.2,820 తీసుకునేందుకు ఇలా చేసినట్లు తెలిసింది. ఫలితంగా రైతు రూ.వెయ్యి మేర నష్టపోతుండ డం గమనార్హం. సదరు వ్యాపారి శుక్రవారం దాదాపు 250 బస్తాల ధాన్యాన్ని కాంటా వేయించినట్లు సమాచారం. అయితే, ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత మేర వరి సాగు చేశాడనే వివరాలను అధికారులు ఆరా తీయకపోవడం గమనార్హం. కేంద్రాల వద్దకు వ్యాపారులను రానివ్వొద్దని ఇటీవల పోలీస్ కమిషనర్ సూచించినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపతున్నారు.
రోడ్డు ప్రమాదంలో తమ్ముడి మృతి, అన్నకు తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment