బీఆర్‌ఎస్ హయాంలోనే రైతుల చేతికి బేడీలు
ఖమ్మంవన్‌టౌన్: జిల్లాలో రైతుల చేతులకు బీఆర్‌ఎస్ హయాంలోనే బేడీలు వేశారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు జి.రేణుకాచౌదరి అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు కొందరు జిల్లాలో పర్యటించగా, వాస్తవాలను తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెప్పడం గర్హనీయమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు నిద్రాహా రాలు మాని పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, త్వరలోనే స్తంభాద్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని ఎంపీ రేణుక వెల్లడించారు. మేయర్ పి.నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కార్పొరేటర్ రఫీదాబేగంతో పాటు మానుకొండ రాధాకిషోర్, మహ్మద్ ముస్తఫా, రామసహాయం మాధవీరెడ్డి, కట్ల రంగారావు, నున్నా రామకృష్ణ, కొరివి వెంకటరత్నం, యడ్లపల్లి సంతోష్, జలీల్ పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి
Comments
Please login to add a commentAdd a comment