సామాజిక బాధ్యత.. అభినందనీయం
ఖమ్మంవైద్యవిభాగం: సామాజిక బాధ్యతగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అంబులెన్స్‌ను అందించడం అభినందనీయమని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. యూని యన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన అంబులెన్స్ తాళాలను సోమవారం ఆయన ఆస్పత్రి అధికారులకు అందజేశారు. అనంతరం కొద్దిసేపు కలెక్టర్ స్వయంగా అంబులెన్స్‌ను నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల సహకారంతోనే ప్రభుత్వం రూపొందించే కార్యక్రమాలు విజయవంతం కావడానికి అవకాశముందని తెలిపారు. ఇక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఆసుపత్రికి అదనంగా అంబులెన్స్ కావాలని చెప్పగానే సమకూర్చిన యూనియన్ బ్యాంక్ అధికారులు అభినందనీయులన్నారు. ఈకార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజియన్ హెడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ హన్మంతరెడ్డి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వర్‌రావు, సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, బ్యాంక్ ఏజీఎం సర్వేశ్, ఏజీఎం సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిలఖాన్
Comments
Please login to add a commentAdd a comment