శాఖల వారీగా పనితీరుపై వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి సంక్షేమ వసతిగృహాల నిర్వహణపై దృష్టి సారించింది. సంక్షేమ శాఖల వారీగా ఒక్కో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఫోకస్ పెట్టింది. ఈ వివరాల సేకరణకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో ప్రత్యేక అధికారులతో సర్వే చేయిస్తోంది. శని, ఆదివారాల్లో సర్వే నిర్వహించిన అధికారులు తాము గుర్తించిన అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేశారు. అయితే విద్యార్థులు తక్కువగా ఉండి, సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేని వసతిగృహాల వార్డెన్లు అక్కడకు వచ్చిన అధికారులను పక్కదారి పట్టించి తమకు అనుకూలంగా
వివరాలు నమోదు చేయించుకున్నారనే చర్చ జరుగుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
జిల్లాలో శాఖల వారీగా వసతిగృహాల సంఖ్య
శాఖ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్
హాస్టళ్లు హాస్టళ్లు
ఎస్సీ సంక్షేమ శాఖ 41 1 1
బీసీ సంక్షేమ శాఖ 22 1 1
గిరిజన సంక్షేమ శాఖ 08 1 1
Comments
Please login to add a commentAdd a comment