ఫిర్యాదులు పెండింగ్లో ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సోమవారం జరిగిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ఏ దరఖాస్తు పెండింగ్ ఉండకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఖమ్మం రామన్నపేటకు కూచిపూడి సన మున్నేటి వరదతో నష్టపోయిన తనకు పరిహారం అందించాలని, ఖమ్మం కై కొండాయిగూడెంకు చెందిన కట్ల రమాదేవి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరారు. అలాగే, వేంనూరు మండలం కొత్త చౌడవరానికి చెందిన దివ్యాంగుడు జి.శ్రీను తనకు ఉద్యోగం ఇప్పించాలని విన్నవించగా, కొణిజర్లకు చెందిన కొర్లపాటి ధనమ్మ ఇంటి స్థలం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు.
అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment