ప్రజా అవసరాల మేరకే అభివృద్ధి పనులు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మంఅర్బన్: ప్రజా అవసరాల మేరకు ఎక్కడెక్కడ ఏమేం అవసరమో గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం 4వ డివిజన్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.43 కోట్లతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల ఆధారంగా అన్ని ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేలా, రాజకీయ వివక్ష లేకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఖమ్మంలో ఒకేసారి అంతా చేయలేమని.. అందుకే నిధులు సర్దుబాటు చేస్తూ పనులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పనులను నాణ్యతతో చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మేయర్ పునుకొల్లు నీరజ, డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయితో పాటు కార్పొరేటర్లు, నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు దండా జ్యోతిరెడ్డి, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, సాధు రమేష్‌రెడ్డి, కృష్ణాలాల్, రంజిత్, ధరణికుమార్, యా కూబ్‌వలీ, ఏలూరి శ్రీనివాసరావు, హన్మంతరావు, పల్లెబోయిన చంద్రం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment