రూ.60 లక్షలతో ఈఈసీ సెంటర్
అటవీశాఖ సీసీఎఫ్ భీమా నాయక్
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌కు వచ్చే వారికి అవగాహన కల్పించేందుకు జంతువుల నమూనాలు, అరుపులు వినిపించేలా ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యూకేషన్ సెంటర్(ఈఈసీ) ఏర్పాటు చేయనున్నామని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) భీమానాయక్ వెల్లడించారు. ఇందుకోసం రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌తో కలిసి సోమవారం ఆయన సింగరేణి గెస్ట్‌హౌస్‌లో అధికారులతో వన్యప్రాణుల సంరక్షణ చర్యలపై సమీక్షించారు. పార్క్‌లో ఫెన్సింగ్ లేని ప్రాంతం నుంచి వన్యప్రాణులు బయటకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నాయని స్థానికులు ఇటీవల రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు సింగరేణి ఓపెన్‌కాస్టు, పార్క్‌కు మధ్య ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం 2.08 కి.మీ. మేర ఫెన్సింగ్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని చెప్పారు. అలాగే, పార్క్‌లో లైబ్రరీ నిర్మించి అటవీశాఖ, వన్యప్రాణులకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఏర్పాటుచేశామన్నారు. అంతేకాక దుప్పుల సంరక్షణకు రెస్క్యూ సెంటర్, డిస్పెన్సరీ, రెస్క్యూ వ్యాన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే ఈఈసీ సెంటర్‌తో పాటు పిల్లలకు ఆట వస్తువులు సమకూరుస్తామని సీసీఎఫ్ వెల్లడించారు.ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, రేంజర్ పి.స్నేహలత, డీఆర్‌ఓ ముత్యాలరావు, ఎఫ్‌ఎస్‌ఓలు నర్సింహా, ముక్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అటవీశాఖ కార్యాలయం
నిర్మాణానికి స్థలం పరిశీలించిన సీసీఎఫ్
సత్తుపల్లి(కల్లూరు): కల్లూరు మండల పరిషత్ ఆవరణలో అటవీశాఖకు కేటాయించిన స్థలంలో కార్యాలయాన్ని నిర్మించనుండగా సీసీఎఫ్ భీమానాయక్, సోమవారం పరిశీలించారు. పుల్లయ్యబంజర్ రోడ్డులో అటవీశాఖకు ఉన్న స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టినందున ప్రభుత్వం ఇక్కడ స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, ఎఫ్‌డీఓ మంజుల, ఎఫ్‌ఆర్‌ఓ ఉమ, డీఆర్‌ఓ రాంసింగ్, ఎఫ్‌బీఓలు భరత్‌కుమార్, ఎం.డీ.ఆజామ్ అలీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment