బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఆందోళన
● కేఎంసీలో ఈఈని అడ్డుకున్న వైనం ● దశలవారీగా చెల్లిస్తామని నచ్చచెప్పిన అసిస్టెంట్ కమిషనర్
ఖమ్మంమయూరిసెంటర్: మున్నేరు వరదతో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు భోజనం సమకూర్చడమే కాక పారిశుద్ధ్య పనులు చేయించిన తమకు బిల్లుల చెల్లింపులో తాత్సారం చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కేఎంసీ కార్యాలయానికి శుక్రవారం వచ్చిన పలువురు కాంట్రాక్టర్లు అక్కడ మున్సిపల్ ఈఈ కృష్ణాలాల్‌ను నిలదీశారు. రూ.2.70 కోట్ల నిధులు కేఎంసీ ఖాతాలో జమ అయినా ఇతరు పనులకు వినియోగించడం సరికాదని మండిపడ్డారు. మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈమేరకు ఈఈ కృష్ణాలాల్ వారిని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా వద్దకు తీసుకొళ్లారు. దీంతో ఆయన మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా బిల్లలు చెల్లిస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్లు శాంతించారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వరరావుతో పాటు బండి సతీష్, పి.శ్రీధర్, జూగల కిషోర్, శ్రీహరిరాజు, కిషోర్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment