హాస్టళ్లలో సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించడమే కాక విద్యార్థులకు వసతులు కల్పించాలనే డిమాండ్‌తో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం రాత్రి కలెక్టరేట్ ఎదుట నిరసన నిద్ర తలపెట్టారు. సంఘం నాయకులు కలెక్టరేట్ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకోగా స్వల్ఫ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వసతిగృహాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదులు సక్రమంగా లేవని, అపరిశుభ్రత తాండవిస్తోందని తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను సంక్షేమ శాఖల డీడీలు పక్కదారి పట్టిస్తుండడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. చలికాలంలో దుప్పట్లు ఇవ్వకపోగా, విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించి పెరిగిన మెస్‌చార్జీలకు అనుగుణంగా మెనూ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు షేక్ నాగుల మీరా, మధు, శివనాయక్, మనోజ్, హరికృష్ణ, ప్రతాప్, బాలాజీ, సుభాష్, సునీల్, రోహిత్, మహేష్, ధోని, రాజు, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్‌ఎఫ్
ఆధ్వర్యంలో ‘నిరసన నిద్ర’
Comments
Please login to add a commentAdd a comment