అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. సాధారణ సమయాన జలుబు, దగ్గు, జ్వరంతో ప్రమాదం లేకున్నా, చలికాలంలో ఈ సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలి. చల్లగాలి ముక్కులోకి వెళ్లకుండా మాస్క్‌లు ధరించాలి. వృద్దులు, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులకు రక్తప్రసరణ మందగించి గుండె జబ్బులు పెరిగే అవకాశముంది. వీరికి పౌష్టికాహారం అందిస్తూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకునేలా చూడాలి. నిత్యం వ్యాయామం చేయడం కూడా మంచిది.
– డాక్టర్ ఎన్.రాంప్రసాద్,
మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్
●
Comments
Please login to add a commentAdd a comment