వ్యాధుల ముప్పు.. | - | Sakshi
Sakshi News home page

వ్యాధుల ముప్పు..

Published Sun, Nov 24 2024 5:46 PM | Last Updated on Sun, Nov 24 2024 5:46 PM

వ్యాధుల ముప్పు..

వ్యాధుల ముప్పు..

పొంచి ఉన్న
జిల్లాలో నానాటికీ పెరుగుతున్న చలి
● జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా బారిన పడుతున్న ప్రజలు ● ఇప్పటికే ఆస్పత్రులకు పెరుగుతున్న కేసులు ● పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

ఖమ్మంవైద్యవిభాగం: గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండగా.. జిల్లాలో రాత్రివేళ కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల వరకు చలి తగ్గకపోగా, సాయంత్రం 5గంటల నుండే ప్రభావం మొదలవుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు చలి తీవ్రత కారణంగా చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జ్వరంతో పాటు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుండగా, న్యూమోనియా బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో పలువురు ఆస్పత్రుల బాట పడుతుండగా చలి ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. మున్ముందు పెరిగే చలితీవ్రత కారణంగా ఇబ్బందులు అదే స్థాయిలో ఉంటాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు కొని తెచ్చుకున్నట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.

పెద్దాస్పత్రికి పెరిగిన తాకిడి

గత వారం రోజులుగా జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో డిసెంబర్‌లో పరిస్ధితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి బయటకు రావాలంటే స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు ధరించాల్సి వస్తోంది. చలి తీవ్రతతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా బారిన పడతున్న పలువురు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రికి వారం రోజులుగా తాకిడి పెరిగింది. ఈనెలలో ఇప్పటికే పెద్దాస్పత్రిలో 21,100 మంది ఓపీ, 1,210 ఇన్‌పేషంట్‌ సేవలు పొందారు. వీరిలో చలిప్రభావంతో వ్యాధుల బారిన పడిన వారే ఎక్కువగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. పలువురు మందులు తీసుకుని వెళ్తుండగా, మరికొందరు ఇన్‌పేషంట్‌గా చేరి చికిత్స పొందుతున్నారు.

పెద్దాస్పత్రి జనరల్‌ వార్డు, చిన్నపిల్లల వార్డుల్లో గత వారం రోజులుగా ఓపీ, ఐపీ కేసులు

తేదీ జనరల్‌ వార్డులు పిల్లల వార్డు

ఓపీ ఐపీ ఓపీ ఐపీ

16 1227 77 323 13

17 110 38 75 10

18 1579 84 404 19

19 1405 67 416 14

20 1235 67 331 12

21 1124 55 380 18

22 1245 72 328 20

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement