యూనిట్ల గ్రౌండింగ్‌లో వేగం
జిల్లాలో మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు.
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఉదయం, రాత్రి చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
8లో
దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదనే అంశాన్ని గుర్తించి ముందుకు సాగాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను కలెక్టర్ శనివారం ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని తెలిపారు. ఈసందర్భంగా దివ్యాంగులతో మమేకమైన కలెక్టర్ వారిని ఆప్యాయంగా పలకరించడమే కాక సెల్ఫీలు దిగారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా సంక్షేమశాఖ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, మానసిక దివ్యాంగుల కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. కాగా, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పురుషులు, మహిళలు, బాలబాలికలకు వేర్వేరుగా వయసు కేటగిరీల వారీగా పోటీలు నిర్వహిస్తున్నారు. ట్రైసైకిల్, షాట్‌ఫుట్, పరుగు పందెం, క్యారమ్స్, చెస్ పోటీలు ఏర్పాటుచేయగా 200మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారు. ఈమేరకు వారికి సత్యకుమార్ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు భోజనం సమకూర్చారు. – ఖమ్మం స్పోర్ట్స్
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పటేల్ స్టేడియంలో దివ్యాంగుల క్రీడాపోటీలు
Comments
Please login to add a commentAdd a comment