‘రిటైనింగ్ వాల్స్’ను పరిశీలించిన నిట్ బృందం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధి కాలనీలను మున్నేటి వరద ముంచెత్తకుండా ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తున్న విషయం విదితమే. రూ.680 కోట్ల అంచనా వ్యయంతో 17 కి.మీ. మేర నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనులను ప్రభుత్వ సూచనల మేరకు శనివారం వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి బృందం పరిశీలించింది. నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతంలో భూమి, వాడుతున్న సామగ్రిని పరిశీలించి నమూనాలు సేకరించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, డీఈ మన్మధరావు, ఏఈలు మహాదేవి, అరుణ తదితరులు ఉన్నారు.
సొరంగ మార్గం పనులు...
సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ–16 ద్వారా తిరుమలాయపాలెం మండలంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనులను శనివారం సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్ట్ ప్రసాద్ బృందం పరిశీలించింది. నిర్మాణ పనులు, అంచనాలపై అధికారులతో చర్చించారు. బృందం వెంట డీఈ రమేష్‌రెడ్డి, రామకృష్ణ, సన్నేప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment