ఈ జాగ్రత్తలు తీసుకోండి... | - | Sakshi
Sakshi News home page

ఈ జాగ్రత్తలు తీసుకోండి...

Published Sun, Nov 24 2024 5:51 PM | Last Updated on Sun, Nov 24 2024 5:51 PM

-

●జలుబు, దగ్గు, జ్వరం సోకితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించి వారి సూచనలతో మందులు వాడాలి.

●కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

●చలికాలంలో చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే ఆహారం తీసుకోవాలి.

●ఇంటి పరిసరాలు, ఆవరణలో దోమల నివారణ చర్యలు చేపట్టాలి.

●శీతల పానీయాలు, ఐస్‌క్రీంలకు దూరంగా ఉండాలి. ప్రధానంగా వీటిని చిన్నారులకు ఇవ్వొద్దు.

●చిన్నారులకు స్వెట్టర్లు వేయకుండా ఇంట్లో కానీ బయటకు కానీ తిరగనివ్వొద్దు.

●గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

●చలి వేళ వీలైనంత మేర బయట తిరగొద్దు. అలా చేస్తే గుండెపోటు, ఛాతినొప్పి వచ్చే ప్రమాదముంది.

●క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి

●వీలైనంత వరకు చలి తగ్గి, సూర్యుడు వచ్చాకే జాగింగ్‌, వ్యాయామం చేయాలి

●బయటకు వెళ్లిన సమయాన స్వెట్టర్‌ ధరించడమే కాక తల, కాళ్లు, చేతుల రక్షణకు జాగ్రత్త వహించాలి.

●విటమిన్‌–సీతో కూడిన పండ్లు, ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి

●పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement