నేలకొండపల్లి: జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని డీఈఈ(కన్‌స్ట్రక్షన్స్) కె.హీరాలాల్ తెలిపారు. మండలంలోని బుద్ధారం, నేలకొండపల్లి, ముజ్జుగూడెం, చెరువుమాధారం, రాజేశ్వరపురం సబ్‌స్టేషన్లను శనివారం పరిశీలించిన ఆయన మండల కేంద్రంలోని ఏఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 43 సబ్‌స్టేషన్ల మరమ్మతులకు రూ.12 లక్షల చొప్పున రూ.5.16 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయని తెలిపారు. ఇక 38 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో అంతరాయాలు లేకుండా సమీప సబ్‌స్టేషన్లతో అనుసంధానం చేస్తున్న ట్లు వెల్లడించారు. ఈ పనులను వేసవి కాలం నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించి నట్లు డీఈఈ తెలిపారు. అంతేకాకుండా కొత్తగా ఏడు సబ్‌స్టేషన్లు మంజూరు కాగా, అనంతనగర్‌లో రూ.2.35 కోట్లతో 33/11 కేవీ విద్యు త్ సబ్‌స్టేషన్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏడీఈ కోక్యానాయక్, ఏఈ కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్లను పరిశీలించిన ఎస్‌ఈ
మండలంలోని వివిధ విద్యుత్ సబ్‌స్టేషన్లను శని వారం ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్ పరిశీలించారు. మండలంలోని బుద్ధారం, ముజ్జుగూడెం, నేలకొండపల్లి సబ్‌స్టేషన్లలో పరిశీలించిన ఆయన విద్యుత్ సరఫరా, నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. అలాగే, 33/11 కేవీ లైన్ల అనుసంధానంపై సూచనలు చేశారు. డీఈఈలు చింతమళ్ల నాగేశ్వరరావు, కె.హీరాలాల్, ఏడీ కోక్యానాయక్, ఏఈ కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment