ఫుడ్‌పార్క్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగా ఫుడ్‌పార్కు ప్రారంభోత్సవం, బహిరంగ సభ ఈనెల 5న జరగనుండగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. ఫుడ్‌పార్కును మంగళవారం పరిశీలించిన అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల అవగాహన సదస్సుకు 10వేల మంది హాజరవుతారని తెలిపారు. ఈమేరకు టెంట్లు, తాగునీరు, ఫ్యాన్లు ఏర్పాటుచేయాలన్నారు. టీజీఐఐసీ సీఈ వినోద్‌కుమార్, డీఈఈ డి.స్మరత్‌చంద్ర, జోనల్ మేనేజర్ పి.మహేశ్వర్‌రావు, కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్, తహశీల్దార్ యోగేశ్వరరావు, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఎంఈఓ రాజేశ్వరరావు, ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
చకచకా పనులు
బుగ్గపాడులోని 203 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన మెగాఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలించి సూచనలు చేయగా పనులు మొదలుపెట్టారు. జిల్లా పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ పి.మహేశ్వర్ పర్యవేక్షణలో మైదానంలోని ముళ్లకంపలను డోజర్లు, జేసీబీలతో తొలగిస్తున్నారు. అలాగే, డివైడర్లపై పెరిగిన పిచ్చిమొక్కలు, రహదారిపై ఉన్న చెత్తను కార్మికులతో తీయించారు. రహదారి పొడవున డివైడర్లకు రంగులు వేయడమే కాక స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment