ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన నేషనల్ హైవే 365 బీజీ ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్, ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్‌కు భూసేకరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా కోర్టు కేసుల పరిష్కారంపై సూచనలు చేశారు. అలాగే, సీతారామ ఎత్తిపోతల పథకం ఏన్కూరు లింక్ కాల్వ మిగులు భూసేకరణ పూర్తిపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, నేషనల్ హైవే పీడీ రామాంజనేయరెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ హేమలత, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్
పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్‌కు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీ, హాస్టళ్లలో ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించిన కలెక్టర్ మాట్లాడారు. ఇందిరా మహిళా డెయిరీ స్థాపన, పాడి పశువుల యూనిట్లకు 250మంది లబ్ధిదారు లను ఎంపిక చేయడంపై అధికారులను అభినందించారు. ఇదే సమయాన మిగతా యూనిట్ల గ్రౌండింగ్‌పై సూచనలు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇందిరా మహిళా డెయిరీకి గవర్నింగ్ బాడీ ఏర్పాటుచేయాలన్నారు. అలాగే, చలికాలం నేపథ్యాన గురుకులాల విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు అందించడమే కాక స్నానానికి వేడి నీళ్లు అందేలా చూడాలని తెలిపారు. డీఆర్డీఓ సన్యాసయ్య, సంక్షేమ శాఖల అధికారులు కస్తాల సత్యనారాయణ, ఎన్.విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, డీఏఓ పుల్లయ్య, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దీన్ పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందేలా విధులు
ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన ఆయన ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. అలాగే, ఉద్యోగులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు.
విద్యార్థుల ఆంగ్ల పరిజ్ఞానం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆంగ్ల పరిజ్ఞానం పెంపొందించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ‘తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ కలెక్టివ్’ ప్రతినిధులు జిల్లాలో ‘వి కెన్ లెర్న్’ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో పరిశీలించాక కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో 6, 7వ తరగతి విద్యార్థుల కోసం అమలుచేస్తున్న పథకం ద్వారా వారిలో పరిజ్ఞానం పెరిగేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. డీఈఓ సోమశేఖరశర్మ, ఏఎంఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment