ఖమ్మంసహకారనగర్: నిర్దేశిత గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన మిల్లర్లు, రెవెన్యూ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదన పు కలెక్టర్ మాట్లాడుతూ 2023–24 వానాకాలం పంట కింద 80,903 మెట్రిక్ టన్నులకు గాను 69,592 మెట్రిక్ టన్నులు, యాసంగి పంటకు సంబంధించి 14,757 మెట్రిక్ టన్నుల్లో 7,743 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించారని తెలిపారు. రెండు సీజన్లలో కలిపి ఇంకా 18,324మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గడువులోగా అందించాలన్నారు. కాగా, నాణ్యత లేకపోతే మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవద్దని, అంతే తప్ప తీసుకున్నాక కోత విధించడానికి వీల్లేదని స్పష్టం చేశా రు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థజిల్లా మేనేజర్ జి.శ్రీలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment