15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
ఖమ్మంమయూరిసెంటర్: నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. గత నెలలో అన్‌టైడ్ గ్రాంట్స్‌ను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా 15వ ఆర్థిక సంఘం నుంచి టైడ్ గ్రాంట్స్‌ను మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలకు ఈ నిధులు విడుదలయ్యాయి. మున్సిపాలిటీల్లో ఈ నిధులను నీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, స్వచ్ఛభారత్ పథకం పనులకు వినియోగించుకోవచ్చు. వ్యర్థాల నిర్వహణకు సైతం వెచ్చించే అవకాశముండడంతో పారిశుద్ధ్యం మెరుగుపడనుంది. కాగా, ఇందులో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు అత్యధికంగా రూ.3కోట్లకు పైగా విడుదల కాగా, మణుగూరు మున్సిపాలిటీకి మాత్రం నిధులు రాలేదు.
కేంఎసీకి రూ.3.66 కోట్లు మంజూరు
నిధుల వివరాలు (రూ.ల్లో)
ఖమ్మం కార్పొరేషన్ 3,66,03,632
పాల్వంచ 1,09,57,689
కొత్తగూడెం 1,00,16,041
మధిర 44,89,053
వైరా 43,90,295
సత్తుపల్లి 43,71,005
ఇల్లెందు 42,95,821
Comments
Please login to add a commentAdd a comment