నేలకొండపల్లి: మండలంలోని రాయగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మండలంలోని రాయగూడేనికి చెందిన పలువురు అసభ్యకరంగా ప్రవర్తించారని బోయిన నాగరాణి ఆరోపించారు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో వర్గం అదివారం ఘర్షణకు పాల్పడ్డారు. ఈ నేపధ్యంలో తమ పట్ల అసభ్యకరంగా వ్యవహరించటమే కాకుండా.. తన భర్తను చంపుతామని హెచ్చరిస్తున్నారని ఫిర్యాదు నాగరాణి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా సదరు మహిళ అకారణంగా తమను దూషించినట్లు గ్రామానికి చెందిన సాయి, సారధి ఆరోపించారు. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
ఉరి వేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణం వికలాంగుల కాలనీకి చెందిన వీరస్వామి(35) ఆదివారం స్థానికంగా ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. సాయంత్రం దాకా రూమ్ నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో లాడ్జి సిబ్బంది డోర్ తీసి చూడగా వీరస్వామి ఉరి వేసుకుని మృతి చెంది ఉండడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, వీరస్వామి తన భార్య ఫొటోను గుండెలపై అతికించుకుని ఉండడంతో కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment