ఆశలు తీరాలి..
ఆకాంక్షలు నెరవేరాలి..
మంచీచెడులను ఒడిలో నింపుకున్న ఓ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది..
ఎన్నో కలలు, ఆశలు నిండిన కొత్త సంవత్సరం వచ్చేసింది..
గత ఏడాది జరిగిన తప్పొప్పులను సమీక్షించుకుంటూ
ఎంచుకున్న లక్ష్యాల సాధనకు పోటీ పడేలా అంతా సిద్ధమవుతున్నారు...
ఈక్రమంలోనే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ జిల్లా అంతటా మంగళవారం రాత్రి సంబురాలు హోరెత్తాయి. చిన్నాపెద్ద, ఊరువాడ తేడా లేకుండా అర్ధరాత్రి 12కాగానే కేక్‌లు కట్ చేయడంతో పాటు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువత రహదారులపైకి వచ్చి కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించారు. ఇక ఇళ్ల ఎదుట మహిళలు రంగువల్లులను తీర్చిదిద్దడంతో వీధులన్నీ శోభాయమానంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment