ఈ ఏడాదిలోనే కొత్త కార్డులు
గత కొన్నేళ్లుగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోగా అర్హులు పథకాలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యాన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 48,113 మంది దరఖాస్తు చేసుకోగా.. 8,876 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. కొత్త కార్డుల జారీ, పాత కార్డుల్లో పేర్ల నమోదుకు మంత్రివర్గ ఉపసంఘం విధివిధానాలు ప్రకటించిన నేపథ్యాన త్వరలోనే కసరత్తు మొదలవుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment