బాణం గురితప్పకుండా..
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో భాగంగా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్చరీ టోర్నీ మంగళవారం ప్రారంభమైంది. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య, శాట్స్ కోచ్ రవిశంకర్ ప్రారంభించారు. రికర్స్, కాంపౌండ్ విభాగాల్లో బాలబాలికలు పోటీ పడగా తొలిరోజు ఎలిమినేషన్ రౌండ్ పూర్తయింది. ఇక బుధవారం పోటీల అనంతరం ర్యాంకులు కేటాయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు కృస్టోఫర్‌బాబు, ఎన్.ఏ.ఉప్పల్‌రెడ్డి, పి.రఘునందన్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment