బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కార్యాచరణ
● ఫణిగిరి నుంచి సాగర్ వరకు సర్క్యూట్ ● పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్
నేలకొండపల్లి: రాష్ట్రంలోని ఫణిగిరి నుంచి నాగార్జునసాగర్ వరకు బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పురారావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్ తెలిపారు. నేలకొండపల్లి లోని బౌద్ధక్షేత్రాన్ని పురావస్తు, టూరిజం శాఖల అధికారులు మంగళవారం పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించేలా కల్పించా ల్సిన సౌకర్యాలు, మ్యూజియం ఇతరత్రా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీడీ రాములునాయక్ మాట్లాడుతూ బౌద్ధక్షేత్రం వద్ద రూ.2.50 కోట్లతో మ్యూజియం ఏర్పాటుచేయడమే కాక ఇతర వసతులు కల్పిస్తామని తెలిపారు. అలాగే, ఫణిగిరి, గాజులబండ, చాడ, నేలకొండపల్లి నుంచి కారుకొండ మీదుగా నాగార్జునసాగర్ వరకు సర్క్యూట్ ఏర్పాటుకు కార్యాచరణ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారి నరసింహారావు, పర్యాటక శాఖ ఎస్‌ఈ సరిత, జిల్లా అధికారి సుమన్‌చక్రవర్తితో పాటు తుంబూరు దయాకర్‌రెడ్డి, రామకృష్ణ, వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, కొర్లకుంట్ల నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, బొందయ్య, జెర్రిపోతుల అంజిని, వంగవీటి నాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, కుక్కల హన్మంతరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, కొడాలి గోవిందరావు, వేగినాటి లక్ష్మీనర్సయ్య, కడియాల నరేష్, యడవల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పాలేరులో పార్క్‌ల పరిశీలన
కూసుమంచి: మండలంలోని పాలేరులో పార్క్‌లు, రిజర్వాయర్‌ను టూరిజం శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. పాలేరులో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించిన నేపథ్యాన చేపట్టా ల్సిన పనుల వివరాలు ఆరా తీశారు. ఈసందర్భంగా టూరిజం ఎస్‌ఈ సరిత, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి ఇక్కడి ప్రణాళికలపై వివరించారు. డీడీ రాములునాయక్, ఇన్‌చార్జి తహసీల్దార్ కరుణశ్రీ, డీఈ రామకృష్ణ, ఏడీ నర్సింగ్, కన్సల్టెంట్ ఆర్కిటెక్ హరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment