ఆశావహుల్లో ఉత్కంఠ
కొత్త ఏడాది ప్రజలు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఆశిస్తుండగా.. కాంగ్రెస్ గెలుపునకు కష్టించిన నేతలు నామి నేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి కార్పొరేషన్ పదవులు దక్కా యి. ఇంకా ఒకటి, రెండు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతోపాటు జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులపై ఆశావహులు దృష్టి సారించారు. సుడా, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ చైర్మన్లు, దేవాదాయశాఖ కమిటీల్లో పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా ఈ ఏడాది తమ కల నెరవేరుతుందని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment