అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించండి..
ఖమ్మంమయూరిసెంటర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనను వెంటనే భర్తరఫ్ చేయా లని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆదివారం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మంలోని ధర్నాచౌక్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం జరిగిన సభలో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర, జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, సీవై పుల్లయ్య, హుస్సేన్ మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే అమిత్‌షా హోంమంత్రి అయ్యారని గుర్తు చేశారు. దేశంలో కులం, మతం, ప్రాంతం ఆధారంగా సమాజ మనుగడ ఉండకూడదని అంబేడ్కర్ భావించారని, ఆ మేరకు రాజ్యాంగంలో రక్షణలు ఏర్పాటు చేశారని వివరించారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద లకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే రక్షణగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల కోసం ఏది పడితే అది రాజ్యాంగ సభలో మాట్లాడటం అమిత్ షా అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు అంబేడ్కర్ పేరు జపం చేసి, అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు అంబేడ్కర్ పేరు ఎత్తగూడదని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, మాదినేని రమేశ్, దండి సురేశ్, శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, తాటి నిర్మల, ఆవుల అశోక్, ఝాన్సీ, ఎం.సుబ్బారావు, నందిపాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన
Comments
Please login to add a commentAdd a comment