సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మంసహకారనగర్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, పి.శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం టీజీఓస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా అదనపు కలెక్టర్లు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, డీఆర్వో ఎం.రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..
● కామేపల్లి మండలం పండితాపురంలో సర్వే నంబర్ 77లో 1.20 ఎకరాల వ్యవసాయ భూమి తన తల్లి పేరున ఉందని, ఆ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, పదేళ్ల క్రితం ఎన్టీపీసీ స్వాధీనం చేసుకుని జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదని గ్రామానికి చెందిన బి.రవి ఫిర్యాదు చేయగా.. దాన్ని ఖమ్మం ఆర్డీఓకు ఎండార్స్ చేశారు.
● రఘునాథ పాలెం మండలం బూడిదంపాడుకు చెందిన కె. శిల్ప.. తాను ప్రజాపాలన సభల్లో ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేశానని, సర్వేలో తన పేరు రాలేదని, ఆన్‌లైన్‌లో పేరు వచ్చేలా చేయాలని కోరుతూ దరఖాస్తు చేసింది. దాన్ని హౌసింగ్ ఈఈకి పంపించి పరిశీలించాలని సూచించారు.
● కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన తుడుం బేబీ తాము ఎస్సి కులానికి చెందిన వారమని, కూలి పని చేస్తూ జీవిస్తున్నామని, ప్రభుత్వం నుంచి వ్యవసాయ భూమి ఇప్పించాలని కోరగా కల్లూరు తహసీల్దార్‌కు దరఖాస్తును ఎండార్స్ చేశారు.
అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment