‘హెల్పింగ్ హ్యాండ్స్’ సేవలు అభినందనీయం
ఖమ్మం సహకారనగర్: ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన తడికమళ్ల నాగేశ్వరరావు – స్వాతి దంపతుల కుమారులు మనీష్, మనోజ్ పుట్టుకతోనే శారీరక వైకల్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న మద్దినేని రవికి ఆయన తల్లిదండ్రులు మద్దినేని ప్రసాదరావు – కమల తెలపడంతో స్నేహితులతో కలిసి సేకరించిన రూ.2లక్షలను హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పంపించారు. ఈమేరకు చెక్కును నాగేశ్వరరావు కుటుంబానికి సోమవారం అదనపు కలెక్టర్ శ్రీజ అందజేశారు. పీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు సిరిపురపు రమణరావు, నాగేంద్రబాబు పాల్గొన్నారు
ఎంబీబీఎస్ విద్యార్థికి రూ.1.04 లక్షలు...
కల్లూరు: కల్లూరు శాంతినగర్‌కు చెందిన తేల్ల పుట్ట ఉదయ్‌కిరణ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, నిరుపేద కుటుంబం కావడంతో ఫీజు కట్టేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన దాతల చేయూతతో రూ.1.04లక్షలు సేకరించారు. ఈమేరకు చెక్కును సోమవారం విద్యార్ధి తల్లిదండ్రులు రాంబాబు, ధనలక్ష్మికి ఫౌండేషన్ ప్రతినిధి సీతారత్న కుమారి చేతుల మీదుగా అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment