సామాన్యులకు నిరాశే మిగిలింది..
కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం విమానాశ్రయంపై ప్రస్తావించలేదు. ఇటు జిల్లాకు, అటు రాష్ట్రానికి కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం.
– రామసహాయం రఘురాంరెడ్డి, ఎంపీ, ఖమ్మం
తెలంగాణకు రిక్తహస్తం
రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లకు నిధులు కేటాయించకపోగా, నీటిపారుదల, రైల్వే రంగాల్లో కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించలేదు. అలాగే, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఊసెత్తలేదు.
– తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ,
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
అన్ని వర్గాలకు అనుకూలం
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకే కాక రైతులకు లబ్ధి చేకూర్చేలా ఉంది. జిల్లా ఆస్పత్రిలో డే కేర్ కేన్సర్ సెంటర్ ఏర్పాటుకానుంది. పాఠశాలలు, పీహెచ్‌సీల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుతాయి. ‘ధన్‌ధాన్య కృషి యోజన’తో రైతులకు ఉపయోగం ఉంటుంది.
– గల్లా సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
పెట్టుబడులను ప్రోత్సహించాలి..
ఆదాయపు పన్ను స్లాబ్‌లు పెంచడం ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచేలా ఉంది. ప్రభుత్వపరంగా రాయితీలు ఇవ్వడం ప్రతీ బడ్జెట్‌లో జరిగేదే. అంతకు మించి కొత్తదనమేమీ లేదు. విప్లవాత్మక అభివృద్ధికి ప్రైవేట్ రంగంలోనూ పెట్టుబడులనూ ప్రోత్సహించాలి.
– ఈశ్వరప్రగడ హరిబాబు, హైకోర్టు అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment