ఖమ్మం డీసీసీబీకి వాట్సాప్ చానల్!
● రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) అధికారులు ఎప్పటికప్పుడు సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా బ్యాంకు కార్యకలాపాలు, సేవల వివరాలు అందరికీ తెలియచేసేలా వాట్సాప్ చానల్ రూపొందించారు. బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్‌ఆదిత్య ప్రత్యేక చొరవతో ఈ చానల్‌ను రూపొందించగా, ఈనెల రెండో వారంలో నిర్వహించే పాలకవర్గ సమావేశంలో ఆవిష్కరించనున్నారు. ఈ చానల్‌లో సభ్యులుగా చేరడం ద్వారా బ్యాంకు అమలుచేస్తున్న పథకాలు, రైతులు, వివిధ వర్గాలకు ఇచ్చే రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్ల వివరాలు, అర్హతలను తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వాట్సాప్ చానల్ సిద్ధం చేయించిన సీఈఓ వెంకటఆదిత్యను బ్యాంకు అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
శ్రీవారికి అభిషేకం,
నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూలవిరాట్‌తో పాటు శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ జరిపించారు. ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెప్మాలో ఆర్పీలకు
పీఓఎస్ యంత్రాలు
ఖమ్మంమయూరిసెంటర్: శ్రీనిధి రుణాల వసూళ్లు, చెల్లింపుల కోసం మెప్మా ఆర్పీలకు పీఓఎస్ యంత్రాలను పీడీ మహేందర్ శనివారం అందజేశారు. జిల్లాలోని ఖమ్మం నగర పాలక సంస్థ, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీ పరిధిలో సమాఖ్యల బాధ్యులకు 20యంత్రాలను అందజేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు సీ్త్ర నిధి రుణాలను చెల్లించే క్రమాన సమాఖ్య బాధ్యులు ఈ యంత్రాల సాయంతో అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమంలో సీ్త్రనిధి ఆర్‌ఎం ఎస్.సుజాత, టీఎంసీ జీ.సుజాత, ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, సీఓలు సల్మా, ద్రౌపది, ఉపేంద్రమ్మ, రోజా పాల్గొన్నారు.
సమగ్రంగా పంటల
వివరాలు నమోదు
రఘునాథపాలెం: జిల్లాలో సాగవుతున్న పంటల వివరాలను నమోదు చేసే పక్రియ సమగ్రంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య సూచించారు. రఘునాథపాలెం మండలం గణేశ్వరంలో శనివారం ఆయన డిజిటల్ క్రాఫ్ బుకింగ్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పంటలు విక్రయానికి ఏర్పాట్లు, మద్దతు ధర తదితర అంశాల్లో ఈ సర్వే కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈనేపథ్యాన ఉద్యోగులు పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అనంతరం మొక్కజొన్న పంటను పరిశీలించి కత్తెర పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఓలు పవన్, ప్రత్యూష, ఏఈఓ శిరిణ్మయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment