చింతకాని: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రైతులతో కలిసి ఉద్యమాలు చేపడుతామని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు వెల్లడించారు. చింతకాని మండలం కొదుమూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకరావాలని 54 రోజులుగా ఢిల్లీలో రైతు సంఘం నాయకుడు జగ్జిత్‌సింగ్ దల్లేవాల్ దీక్ష చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే, రాష్ట్రప్రభుత్వం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని తెలిపారు. ఇకనైనా సబ్సిడీపై వ్యవసాయానికి పరికరాలు అందజేయడమే కాక వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని, అర్హులందరికి ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ, రైతు సంఘం నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, కూచి పూడి రవి, పావులూరి మల్లికార్జున్‌రావు, దూసరి గోపాలరావు, అబ్బూరి మహేష్, నక్కనబోయిన సుజాత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment